TDP Chief Chandrababu deided to leave Karakatta house to shift Vijayawada. By demolish of Prajavedika by AP Govt and after developments Babu taken this decision.
#apgovt
#amaravati
#chandrababu
#vijayawada
#Prajavedika
#jagan
#ycp
#tdp
ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కరకట్ట మీద నుండి ఖాళీ చేయించాలని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. ముందుగా చంద్రబాబు తన హాయంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్రబాబు కళ్ల ముందే కూల్చేసారు. ఇక, చంద్రబాబు ఇంటి గురించి జగన్ ఆలోచన చేస్తున్నారని..నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆ నివాసం లో ఉంటున్నారంటూ ఒక రకంగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడేసాలా చేసారు. దీంతో..గౌరవంగా తానే తన నివాసాన్ని ఖాళీ చేస్తే మంచిదనే అభిప్రాయానికి బాబు వచ్చారు. అంతే కొత్త నివాసం ఖరారు చేసారు. నాలుగు రోజుల్లోగా ఆయన తన కొత్త నివాసానికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు.